WGL: వరంగల్ పచ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. 24 గంటల్లో స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని, ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కోరాలని సూచించారు. కార్యక్రమంలో BRS నాయకులు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే నాయినికి దాస్యం వినయ్ భాస్కర్ సవాల్


