హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాంస్కృతిక సారథి కళాకారుడిగా మోహన్ నాయక్ బాధ్యతల స్వీకరణ

ADB: ఆసిఫాబాద్ డీపీఆర్‌వో కార్యాలయం నుంచి బదిలీపై వచ్చిన ఉట్నూర్ గాయకుడు మోహన్ నాయక్, ఆదిలాబాద్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడిగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై చైతన్యం నింపేలా కళా ప్రదర్శనలు ఉండాలని సూచించారు.