హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్

MLG: కన్నాయిగూడెం మండలంలోని ఐలాపూర్ పంచాయతీ అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. పందేలు ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు. నాలుగు కోడి పుంజులు, రూ.7,040 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.