హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ను కలిసిన ఎమ్మెల్యే జారె

BDK: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన బి.ఎం. సందీప్ కుమార్‌ను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజలకు మెరుగైన నాయకత్వం అందించాలని ఆకాంక్షించారు.