హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి: సీపీ

WGL: పోలీస్ విధులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని వరంగల్ సీపీ ఎన్. శ్వేత సూచించారు. 24 వారాల ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా ఐదుగురు ప్రొబేషనరీ డీఎస్పీలు సోమవారం సీపీని కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణ, నేరాల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధతతో పనిచేయాలన్నారు.