హైదరాబాద్: 28°C
తెలంగాణ

అష్టా చమ్మా స్థావరం పై దాడి.. ఐదుగురు అరెస్ట్

BDK: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి శివారులో అష్టా చమ్మా ఆడుతున్నారన్న సమాచారంతో సోమవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అష్టా చమ్మా ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రెండు ఆటోలు, మూడు బైకులు, రూ.11,080 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.