WGL: రాయపర్తి మండలం సూర్యతండా పరిధిలోని చక్రుతండాకు చెందిన గుగులోతు స్వామి ఆటో సోమవారం రాత్రి అగ్నిప్రమాదంలో పాక్షికంగా దగ్ధమైంది. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే స్వామి ఆటోను ఇంటి వద్ద నిలిపి స్వగ్రామానికి వెళ్లారు. ఆటోకు మంటలు అంటుకోవడంతో స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే సగభాగం కాలిపోయింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
అనుమానాస్పద స్థితిలో ఆటో దగ్ధం


