హైదరాబాద్: 28°C
వార్తలు

ఒడిశాలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఒడిశాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కటక్, భువనేశ్వర్ నగరాల్లో పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా కటక్‌లో నిర్వహించే ప్రసిద్ధ బాలి జాత్ర ఉత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు.