ADB: బోథ్ X-రోడ్డు నుంచి బుద్దికొండ వరకు వయా తేజపూర్ మీదుగా రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణంతో అనేక గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు తొలుగుతాయన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, గ్రామాలకు రోడ్లు, విద్య, వైద్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని MLA పేర్కొన్నారు.
తెలంగాణ
రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్


