ASF: రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ ఛైర్మన్ అర్షద్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో రహదారులు అధ్వాన్నంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారన్నారు.
తెలంగాణ
రహదారులపై మంత్రిని కలిసిన జిల్లా మైనారిటీ ఛైర్మన్


