హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ భూముల వద్ద దౌర్జన్యం.. రైతుల ఫిర్యాదు

KNR: సైదాపూర్ మండలం రాయికల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 107, 120లో 50 ఏళ్లుగా సాగు చేస్తున్న తమ భూముల వద్ద కొందరు దౌర్జన్యం చేస్తూ, బెదిరిస్తున్నారని రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గడిపే లింగయ్య, కానుకమ్మ, రజిత, రాజ్‌కుమార్, రాములుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మొరే స్వామి, మొరే రాజయ్య, అంబాల ఐలయ్య కోరారు