JGTL: ఎండపల్లి మండలం ఉండేడ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం ప్రజావాణిలో రిపోర్టర్ చిలుక సతీష్ వినతి పత్రం అందజేశారు. 10 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.
తెలంగాణ
'బస్సు సౌకర్యం కల్పించాలని వినతి'


