హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాగుపై నిర్మించిన వంతెనపై రక్షణ గోడ లేక ప్రమాదకరం

ADB: ఇచ్చోడ మండలం చించోలి గ్రామం వద్ద వాగుపై నిర్మించిన వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో, వాహనాల చోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏమాత్రం అదుపు తప్పినా వాగులో పడే ప్రమాదముంది. వంతెనపై రక్షణ గోడలు నిర్మించాల్సిన అవసరముంది.