హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీకోటిలింగేశ్వర దత్తదేవస్థానంలో ఆకాశదీపం

వనపర్తి: కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజి దగ్గర గల సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వరదత్తదేవస్థానంలో కార్తీకమాసం సోమవారం ప్రదోషకాలంలో భక్తులు ఆకాశదీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీకోటిలింగేశ్వరస్వామివారికి, స్వర్ణ కవచ పంచలోహ శివలింగానికి భక్తులు వేద పండితుల మంత్రాల మధ్య ప్రదోషకాల పూజలు, అభిషేకాలు నిర్వహించి నక్షత్ర హారతులు సమర్పించారు.