హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయికి ఎదిగిన ఇల్లంతకుంట విద్యార్థినులు

SRCL: ఇల్లంతకుంట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు రేష్మ, పండుగ సహస్ర రూపొందించిన స్మార్ట్ గ్లాస్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్–2026లో ద్వితీయ స్థానం సాధించిన ఈ ప్రాజెక్టును డిసెంబర్ 14 నుంచి 19 వరకు పుదుచ్చేరిలో జరిగే 53వ జాతీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు.