హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుట్కా విక్రయిస్తే చర్యలు తప్పవు

నారాయణపేట జిల్లా కేంద్రంలోని హాజీ ఖాన్ పేటలో ఎండి మీర్జా అనే వ్యక్తి కిరాణా షాపుల్లో సోమవారం వివిధ బ్రాండ్లకు చెందిన గుట్కా, పాన్ మసాలా, పొగాకు ప్యాకెట్లను పట్టుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3,480 వుంటుందని చెప్పారు. మీర్జాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. గుట్కాకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు.