హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్లో 11 మందికి జైలు శిక్షలు

KMR: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 11 మందిని పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం 8 మందికి ఒకరోజు జైలు శిక్ష, జరిమానా విధించగా, మరో ముగ్గురికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.