హైదరాబాద్: 28°C
తెలంగాణ

KTR వ్యాఖ్యలపై MP కావ్య విమర్శలు

ఉమ్మడి జిల్లా: హనుమకొండలో KTR వ్యాఖ్యలు రాజకీయ నిరాశకు నిదర్శనమని MP కడియం కావ్య విమర్శించారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. పదేళ్ల BRS పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోని నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని అన్నారు.