హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి

JGL: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి శివారులో గోదావరి ఒడ్డున విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన వ్యక్తి గేదె మేతకు వెళ్లగా ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గేదె మృతితో లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.