BPT: ఈ నెల 26న జరగనున్న బాపట్ల మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో సోమవారం సాయంత్రం పట్టణంలో పోలీస్ కవాతు నిర్వహించారు. డీఎస్పీ సీ.హెచ్.చంద్రమౌళి ఆధ్వర్యంలో సీఐ ఆర్.రాంబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలు నిర్భయంగా ఓటేయాలని భరోసా కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి'


