హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాస్వామ్య బలోపేతంలో యువత పాత్ర కీలకం

SKLM: ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం లో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని DRO విశ్వేశ్వరరావు అన్నారు.విద్యార్థి దశ నుంచే ఎన్నికల ప్రక్రియ, ఓటు హక్కు ప్రాధాన్యత పై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.