హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ తిరస్కరణపై మాజీ మంత్రి అభ్యంతరం

KKD: కాట్రావులపల్లి వైసీపీ సర్పంచ్ అభ్యర్థి గండికోట అరుణ నామినేషన్‌ను కేవలం ఒక్క అక్షరం తేడాతో తిరస్కరించడంపై మాజీ మంత్రి తోట నరసింహం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయం కోసం అప్పీల్ చేసేందుకు వెళ్లగా ఎన్నికల అప్పిలేట్ అధికారి, పెద్దాపురం ఆర్డీవో అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి చెందారు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అరుణకు న్యాయం చేయాలని కోరారు.