హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనికేరులో కూటమి అభ్యర్థి సర్పంచ్‌గా ఏకగ్రీవం

కోనసీమ: ఆలమూరు మండలం పెనికేరు సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున ఈదల చిన్నబాబు ఏకగ్రీవంగా నిలిచారు. చిన్నబాబు మినహా మరెవరూ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయలేదు. అలాగే ఆయన సూచించిన అభ్యర్థులు మినహా 12 వార్డుల్లోనూ ఇతరులెవరూ నామినేషన్లు వేయలేదు. సర్పంచ్‌తో పాటు 12 వార్డుల ఏకగ్రీవ ఎన్నికపై అధికారిక ప్రకటన ఈ నెల 24న వెలువడనుంది.