GNTR: రైలులో విజయవాడ–బాపట్ల మార్గంలో నలుగురు పిల్లలను అనుమానాస్పదంగా తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కాంచీపురంలో ఉద్యోగాల పేరుతో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు బాలికలు, ఒక బాలుడిని తీసుకెళ్తున్నట్లు తెలిసింది. తెనాలి దాటిన తర్వాత పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించి, నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైలులో పిల్లల అక్రమ రవాణాకు యత్నం.. నిందితుడి అరెస్ట్


