తెలంగాణ
రూ.30 వేల అప్పు కోసం హత్య
NLG: రామగిరిలో రూ.30 వేల అప్పు తిరిగి చెల్లించే విషయంలో తలెత్తిన వివాదంతో హాలియాకు చెందిన యానక ప్రభాకర్‌ను 2020లో హత్య చేసిన కేసులో నిందితుడు టేకి సురేష్‌కు నల్గొండ ప్రత్యేక సెషన్స్ కోర్టు సోమవారం జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి ఎన్. రోజా రమణి ఈ మేరకు తుది తీర్పు వెలువరించారు.


