హైదరాబాద్: 28°C
తెలంగాణ

'షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి'

​RR: రవాణా, పరిశ్రమలు, జాతీయ రహదారి వంటి అనుకూలతలతో పాటు ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్న షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్‌చార్జి ఎమ్మె సంతోష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో షాద్‌నగర్ ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాములు ముదిరాజ్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.