హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ రహిత భారత్ యాత్రకు నాగార్జున మద్దతు

HYD: ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్’ మిషన్‌కు సినీనటుడు నాగార్జున సంఘీభావం తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు మూడు రోజుల పాటు ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ యాత్ర నిర్వహించనున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, యాత్రలో అందరూ పాల్గొనాలని నాగార్జున పిలుపునిచ్చారు.