SRCL: కార్తీక శుద్ధ వైకుంఠ చతుర్దశి సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సాయంత్రం ప్రదోష కాలంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మహాపూజ నిర్వహించారు. అనంతరం స్వామివారి పొన్నచెట్టు సేవ ఊరేగింపును భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
భీమేశ్వరాలయంలో వైభవంగా పొన్నచెట్టు సేవ


