హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కలెక్టరేట్ గ్రంథాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలి'

బాపట్ల: పరిపాలన గ్రంథాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేయాలని కలెక్టర్ డా. వినోద్ కుమార్ సూచించారు. దాతల ద్వారా 1000కి పైగా పుస్తకాలు అందాయని తెలిపారు. పుస్తకాల వివరాలు స్వర్ణ బాపట్ల వెబ్‌సైట్‌లో పెట్టాలని, విద్యార్థులు, యువత వినియోగించుకునేలా చేయాలన్నారు. చీరాల, రేపల్లెలోనూ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు.