హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోగోట్టుకున్న బంగారం అప్పగించిన కండక్టర్

వనపర్తి నుంచి కొత్తకోటకు ప్రయాణిస్తున్న మహిళలు TG32Z 0020 బస్సులో మరిచిపోయిన 4 తులాల బంగారు ఆభరణాలను కండక్టర్ వెంకటస్వామి భద్రపరిచి తిరిగి వారికి అందజేశారు. కండక్టర్ నిజాయితీని అభినందిస్తూ మహిళా ప్రయాణికులు శాలువాతో సత్కరించి, ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలిపారు. కండక్టర్ చూపిన నిజాయితీ, బాధ్యతాయుతమైన సేవను వనపర్తి డిపో ఉద్యోగులు సైతం అభినందించారు.