హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమికి వెలుగులీనుతున్న ఎరకేశ్వరాలయం

SRPT: కార్తీక పౌర్ణమి సందర్భంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రిలోని చారిత్రక కాకతీయుల కాలం నాటి ఎరకేశ్వరాలయం విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా మారింది. గోపురం, ప్రాంగణం రంగురంగుల దీపాలతో మెరిసిపోతున్నాయి. మంగళవారం ప్రత్యేక అభిషేకాలు, బిల్వార్చనలు, సామూహిక దీపారాధనకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది.