హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి: SP

SRD: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది నుంచి SP పరితోష్ పంకజ్ నేరుగా సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ SIలకు ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.