హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాద్రి అప్పన్న సేవలో సినీనటి శిల్పాశెట్టి

విశాఖ: ప్రముఖ సినీనటి, మోడల్‌ శిల్పాశెట్టి, భర్త రాజ్‌కుంద్రతో కలిసి ఆదివారం సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో జల్లేపల్లి వెంకటరావు వారికి స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆండాళ్‌ అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.