హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలపై అవగాహన కార్యక్రమం

కృష్ణా: పామర్రు సెంటర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్సై శ్రీనివాసు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాల నిర్మూలన, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రతపై వివరించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.