హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదల ఇళ్ల జోలికొస్తే సహించేది లేదు: జోగు రామన్న

ADB: ఖానాపూర్ చెరువు అభివృద్ధి పేరిట పేదల ఇళ్లను కూల్చివేస్తే సహించేది లేదని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట BRS ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. MLA పాయల్ శంకర్‌పై భూకబ్జా ఆరోపణలున్నప్పటికీ విచారణ జరపని ప్రభుత్వం పేదల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగించడం సరికాదని అన్నారు.