విశాఖ: రుషికొండ బీచ్‌లో శనివారం గల్లంతైన డిగ్రీ విద్యార్థి సయ్యద్ జాహిద్ రజా (19) మృతదేహం సోమవారం ఉదయం ఒడ్డుకు చేరింది. విశాఖకు చెందిన జాహిద్ బుల్లయ్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి దిగి గల్లంతయ్యాడు. రెండు రోజులుగా గాలింపు చేపట్టగా సాయిప్రియ రిసార్ట్స్ సమీపంలో మత్స్యకారులకు మృతదేహం కనిపించింది.
ఆంధ్రప్రదేశ్
రుషికొండ తీరంలో విద్యార్థి మృతదేహం లభ్యం


