హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ సహా 4 జిల్లాలకు వర్ష సూచన

విశాఖ: నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో మంగళవారం విశాఖ, అనకాపల్లి, అల్లూరి, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.