హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లైంగిక దోపిడీని సమూలంగా నిర్మూలించాలి

SKLM: లైంగిక దోపిడీని సమూలంగా నిర్మూలించాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు పిలుపునిచ్చారు. సోమవారం పొందూరు మండలం కొంచాడలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల అరికట్టడంపై న్యాయ సేవాధికార సంస్థ పథకాలను వివరించారు. ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు.