హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగుల క్రీడా పోటీలకు ఎంపికలు

ASR: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ. జగన్నాథరావు తెలిపారు. 13 ఏళ్లు పైబడిన వారికి ఆరు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తామని, ఆసక్తిగల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.