హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ

VKB: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్ సోమవారం కొడంగల్ పోలీస్ స్టేషన్‌తో పాటు సీఐ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసు ఫైళ్లు, పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు.