హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సైలెన్సర్లు తీసేసి నడిపితే చర్యలు తప్పవు'

ELR: సైలెన్సర్లు తీసేసి భారీ శబ్దాలతో మోటార్ వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆకివీడు CI కాళీ చరణ్ హెచ్చరించారు. సోమవారం రాత్రి ఆకివీడు ప్రధాన సెంటర్లో జాతీయ రహదారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యువకులు ఖరీదైన మోటార్ సైకిళ్లు నడుపుతూ భారీ శబ్దాలు చేయడం గమనించి వాహనాలు సీజ్ చేశారు. SI శుభ శేఖర్ పాల్గొన్నారు.