హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లబెల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: సీపీఐ

WGL: నల్లబెల్లి మండలాన్ని కరువు జాబితాలో చేర్చి రైతు, కూలీలను ఆదుకోవాలని సీపీఐ నాయకులు కుమారస్వామి డిమాండ్ చేశారు. వరి సాగు చేయని రైతులకు ఎకరానికి రూ.20 వేలు, పత్తి రైతులకు రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. మాఫీ కాని రుణాలను మాఫీ చేయాలని, ఉపాధి హామీలో రోజుకు రూ.700 చొప్పున 200 రోజుల పని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరారు.