అన్నమయ్య: జిల్లా పరిషత్ చైర్మన్ సుగవాసి ప్రసాద్ బాబును రాయచోటికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేపట్టే ప్రజాసేవ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లవేళలా సంపూర్ణ మద్దతు అందిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సుగవాసి ప్రసాద్ బాబుకు ఘన సత్కారం


