హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్త చేయూత పింఛన్ల పంపిణీలో మంత్రి

BHPL: అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం భూపాలపల్లి(M)లోని ఐదు గ్రామాలకు చెందిన 144 మంది లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కొత్త చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేశారు. వీరిలో 74 మంది వితంతువులు, 27 మంది దివ్యాంగులు, 40 మంది గీత కార్మికులు, ముగ్గురు ఒంటరి మహిళలు ఉన్నట్లు తెలిపారు.