హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్లెయిమ్స్ సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు: కలెక్టర్

ATP: SIRపై సీఈఓ వివేక్ యాదవ్ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. జిల్లాలో 2,48,087 ఏఎస్‌డీడీ ఓటర్లకు ఈ నెల 30లోపు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తామని ఆయన వివరించారు. ఫారం-6 కింద 4,296, ఫారం-7 కింద 35, ఫారం-8 కింద 1,154 క్లెయిమ్స్ అందాయని, వీటన్నింటినీ నిరంతరం పర్యవేక్షిస్తూ సకాలంలో పరిష్కరిస్తామని తెలిపారు.