హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీవీఎంసీ పరిధిలో రెవిన్యూ మేళా

VSP: నగర పరిధిలో ఆస్తి పన్ను సంబంధిత సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 24, 25 తేదీల్లో జీవీఎంసీ అన్ని జోన్లలో రెవెన్యూ ట్యాక్స్ మేళాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాల్లో కొత్త అసెస్‌మెంట్లు, పన్ను మినహాయింపులు, యజమాని పేరు మార్పులు, అసెస్‌మెంట్ల విభజన, విలీనం, ఇంటి నంబర్ల సవరణ చేస్తామన్నారు.