హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోదావరిలో రొయ్య పిల్లల సేకరణకు కఠిన నిబంధనలు: కలెక్టర్

కోనసీమ: గోదావరిలో రొయ్య పిల్లల సేకరణ పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధవళేశ్వరం బ్యారేజీ భద్రత దృష్ట్యా గేట్లకు 500 మీటర్ల దిగువన మాత్రమే సేకరణకు అనుమతించాలని సూచించారు. అర్హులైన సంప్రదాయ మత్స్యకారులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, హైకోర్టు ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు.