హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దరఖాస్తులను పరిశీలించి, సత్వరమే పరిష్కారం చూపాలి'

ASF: ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. గత దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దన్నారు.