హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం

KRNL: పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయినవారు, మధ్యలో చదువు మానేసినవారికి ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫెయిల్ అయిన వారికి ఉచిత పుస్తకాలు, ఆదివారాల్లో ప్రత్యేక తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.