హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే

కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ అభివృద్ధికి నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. సోమవారం నగర పంచాయతీ నూతన ఛైర్‌పర్సన్‌గా గుబ్బల గంగా రత్న భవాని, వైస్ ఛైర్‌పర్సన్‌గా ములపర్తి దుర్గా మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.